మిర్చి యార్డులో ఉచిత భోజనం ప్రారంభం

Jan 30,2024 00:13

సభలో ప్రసంగిస్తున్న మంత్రి అంబటి రాంబాబు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరు మిర్చి యార్డులో రైతులకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం ప్రారంభించారు. ఉచిత భోజనంతోపాటు, వైద్యశాల, యార్డులో విద్యుద్దీకరణ టవర్‌ లైట్స్‌ను, మినరల్‌ వాటర్‌ కేంద్రాలను మంత్రి అంబటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యార్డులో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. టోకెన్ల ద్వారా రైతులకు, కూలీలకు ఆహార పానియాలు ఉచితంగా అందిస్తామని యార్డు చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా కార్యక్రమానికి వ్యవసాయమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యార్డు పాలకవర్గ సభ్యులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. చైర్మన్‌ ఏకపక్ష నిర్ణయాలపై యార్డులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గ్రూపు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారమవుతోంది.

➡️