మిర్చి యార్డులో కొనసాగుతున్న రద్దీ

Feb 2,2024 00:04

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : గురటూరు మిర్చి యార్డులో రద్డీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో టిక్కిలు రావదం అంతా యార్డు ఆవరణం అంతా మిర్చి బస్తాలతో నిండిపోతోంది. వాహనాలు కూడా భారీగా రావడం వల్ల అటు గుంటూరు-చిలకలూరిపేట, ఇటు గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కల్గుతోంది. అందువల్ల రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటలలోపు మిర్చి వాహనాలన్నీ చేరాలని యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటనలోకోరారు. పెద్ద సంఖ్యలో టిక్కిలు రావడం వల్ల యార్డు అంతా కిటకిటలాడుతోంది. గురువారం 1,24,034 టిక్కిలు వచ్చాయి. పాత నిల్వలతో కలిపి 1,20,528 టిక్కిలు అమ్ముడుపోయాయి. యార్డులో 79,912 టిక్కిలు ఇంకా నిల్వ ఉన్నాయి. సాధారణ రకాలు ధర క్వింటాలు కనిష్ట ధర రూ.8,500, గరిష్ట ధర రూ.20వేలు పలికింది. తేజ,బాడిగ రకాలు కనిష్ట ధర రూ.8వేలు, గరిష్టంగా రూ.21,500 ధర లభించింది. ప్రస్తుతం సరుకు నాణ్యత బాగుండటంతోఎక్కువ మంది ఏ రోజు కారోజు కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. కొంతమంది రైతుల నుంచి వ్యాపారులు ఆంక్షలు విధిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ఆరబెట్టుకుని తీసుకురమ్మని షరతువిధిస్తున్నారు. యార్డులోనే ఖాళీ స్థలాలలో ఆరబోసుకుని సాయంత్రం కల్లా గోతాల్లోకి ఎత్తుకోవడం కన్పించింది. ఎండిన కాయలకు ధరలు బాగావస్తుండటంతో ఎక్కువ మంది తేమ శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

➡️