మిస్టర్‌ ఆంధ్ర పోటీల్లో మెరిసిన ‘ప్రకాశం’ విద్యార్థి సయ్యద్‌ అలీం

Nov 27,2023 19:40
మిస్టర్‌ ఆంధ్ర పోటీలలో ప్రకాశం విద్యార్థి బహుమతి అందుకుంటున్నదృశ్యం

మిస్టర్‌ ఆంధ్ర పోటీలలో ప్రకాశం విద్యార్థి బహుమతి అందుకుంటున్నదృశ్యం
మిస్టర్‌ ఆంధ్ర పోటీల్లో మెరిసిన ‘ప్రకాశం’ విద్యార్థి సయ్యద్‌ అలీం
ప్రజాశక్తి-కందుకూరు : ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాల ఈసిఈ విద్యార్థి సయ్యద్‌ అలీం మిస్టర్‌ ఆంధ్ర 27వ బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌ షిప్‌-2023లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడని కళాశాల కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య అభినందించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలో పంచముఖి హనుమాన్‌ ఫిట్‌ నెస్‌ జిమ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 150 మంది బాడీ బిల్డర్లు పోటీల్లో పాల్గొని తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించారు. తమ కళాశాల విద్యార్థి ఈ ఘనత సాధించడంతో కళాశాలలో పండుగ వాతావరణం నెల కొందన్నారు రామయ్య తమ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ఉన్నత స్థాయిలను అధిరోహించడం చాలా గర్వంగా ఉందన్నారు. తమ కళాశాల విద్యార్థులను రాష్ట్రీయ, దేశస్థాయి ఆటల పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించడం ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ అన్నారు. జబర్దస్త్‌ లో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆది కూడా తమ కళాశాల పూర్వ విద్యార్థి అవ్వడం తనకు చాలా సంతోషాన్ని స్తుందన్నారు.అలీం ప్రకాశం కళాశాలలో ఉన్న సమయంలో 2021 సంవత్సరంలో శ్రీకాకుళంలో మిస్టర్‌ ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీల్లో ఐదవ స్థానాన్ని, విజయవాడలో మూడో స్థానాన్ని సాధించడంతో పాటు, అమలాపురంలో జాతీయస్థాయి జూనియర్‌ బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొని కళాశాలకు గర్వకారణంగా నిలిచారని కళాశాల టెక్నికల్‌ డైరెక్టర్‌ కంచర్ల విజయ శ్రీనివాస్‌ కొనియాడారు. కళాశాలతో పాటు, కందుకూరు పట్టణానికి బాడీ బిల్డింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురావడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు. జనవరిలో భువనేశ్వర్‌ లో జరగబోయే జూనియర్‌ మిష్టర్‌ ఇండియా పోటీలో పాల్గొంటున్న అలీం కు శుభాకాంక్షలు తెలిపారు .కళాశాలలో చదువుతో పాటు వివిధ బాడీ బిల్డింగ్‌ పోటీలలో పాల్గొనడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలను అందించిన తన నాన్న సయ్యద్‌ కరిముళ్ళ కు, కళాశాల మేనేజ్మెంట్‌కు మరియు అధ్యాపకులకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. అలీం.సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న అలీం సాధించిన ఘనతను అభినందిస్తూ , భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సిహెచ్‌ రవికుమార్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ హరిబాబు, అధ్యాపకులు ఆకాంక్షించారు.

➡️