ముందస్తు సంక్రాంతి సంబరాలు

Jan 8,2024 17:49
భోగి మంటలు వేస్తున్న దృశ్యం

భోగి మంటలు వేస్తున్న దృశ్యం
ముందస్తు సంక్రాంతి సంబరాలు
ప్రజాశక్తి -నెల్లూరు
బుజ బుజ నెల్లూరులోని శేషు స్కూల్లో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు సోమవారం భోగి మంటలు, రంగవల్లులు, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలతో శేషు స్కూల్‌ సంక్రాంతి శోభను సంతరిం చుకుంది. ఎరుకలసాని, పిట్టలదొర, బుడబుక్కలోడు, హరిదాసు వేషాలు, సాంస్కతిక నత్యాలు, అందరినీ అలరించాయి. రైతు ఆవేదనను చిన్నారులు హద్యంగా వర్ణించారు. కరస్పాండెంట్‌ శేషు సార్‌ మాట్లాడుతూ పండుగలు మనం సంస్కతి, సాంప్రదాయాలకు ప్రతీకలని ,పండుగ విశిష్టతను అందరూ తెలుసు కో వాలన్నారు. తానా వారు నిర్వహించిన శతక పద్యార్చన సర్టిఫికేట్లను 80 మందికి శేషు సార్‌ ప్రదానం చేశారు. తల్లి దండ్రులు,,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️