ముగిసిన జంతు ఆరోగ్య సదస్సు

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల

ప్రజాశక్తి – ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో జంతువుల ఆరోగ్యంపై సమీక్ష, సిబ్బందికి అవగాహన కల్పించే జంతుఆరోగ్య కమిటీ రెండు రోజుల సమావేశాలు సోమవారం ముగిసాయి. జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా, జూఅధికారులు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌కుమార్‌, డాక్టర్‌ పురుషోత్తం, జూ అసిస్టెంట్‌ వెటర్నరీ వైద్యులు డాక్టర్‌ కరుణాకరణ్‌, వెటర్నరీ, లాబొరేటరీ, పశుసంవర్ధక శాఖల వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జూ పార్కులో జంతువుల ఆరోగ్య పరిస్థితి, వాటి ఆహార నియమాలపై క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా వివరించారు. జూ పార్కులో భద్రతా చర్యలు, జంతు ఆరోగ్య సంరక్షణపై యానిమల్‌ కీపర్స్‌కు శిక్షణపై డాక్టర్‌ నవీన్‌, డాక్టర్‌ మనోహర్‌ వివరించారు. అనంతరం జంతువుల ఆరోగ్యం, ఎన్‌క్లోజర్లపై విశ్లేషణ, తదితర విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా జంతు సంరక్షకుల సందేహాలను నిపుణుల కమిటీ నివృత్తి చేసింది. కార్యక్రమంలో జూ అధికారులు మంగమ్మ, అస్టిస్టెంట్‌ కూరేటర్లు గోపాల నాయుడు, గోపి పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న జూ వైద్యులు, అధికారులు

➡️