మునగోడులో కలెక్టర్‌ పర్యటన

 అమరావతి మండలం మునుగోడులో ఎమ్మెల్యేతో కలిసి పర్యటిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌
ప్రజాశక్తి – అమరావతి, కారంపూడి, నూజెండ్ల :
గ్రామోదయం కార్యక్రమంలో భాగంగా పల్నాడు మండలంలోని మునగోడులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ శుక్రవారం పర్యటించారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ కాలనీలను సందర్శించడంతోపాటు గ్రామంలో పరిస్థితులపై ప్రజలతో చర్చించారు. డ్రెయినేజీ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి స్థానికులు తెచ్చారు. పారిశుధ్యం, డ్రెయినేనజీ పనులను, ఓటరు జాబితాను కలెక్టర్‌ పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 నిర్వహణ తీరును సందర్శించారు. గ్రామంలో బాలికలకు హిమోగ్లోబిన్‌ శాతం ఎంత ఉందో పరిశీలించారు. లేనివారికి వారి తల్లితండ్రుల్లో హిమోగ్లోబిన్‌ పెరిగే శాతాన్ని, బలమైన ఆహారం తీసుకునే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారు తల్లి కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతున్నది, ఆడపిల్లలకు బంగారు తల్లి రికార్డులను అందించారా లేదన్నది పరిశీలించారు. అనంతరం క్లాప్‌ మిత్రులను కలిసి, వారితో కలిసి కాఫీ తాగుతూ క్లాప్‌ మిత్రాల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో, అడిగి తెలుసుకుని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, మండల ప్రత్యేకాధికారి సూర్యప్రకాశ్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ శ్రీనివాసరావు పాల్గొన్నారు.కారంపూడి మండలంలోని పెదకొదమగుండ్ల పరిధిలోని బ్రాహ్మనాయుడు కాలనీలో మండల ప్రత్యేకాధికారి జోసఫ్‌ కుమార్‌, ఎంపిపి ఎం.శారదశ్రీనివాసరెడ్డి పర్యటించారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి సీజనల్‌ వ్యాధులు ప్రాబలకుండా పారిశుధ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. తడి చెత్త, పొడిచెత్త కేంద్రాన్ని సందర్శించి అక్కడున్న పారిశుధ్య సిబ్బందితో మాట్లాడారు. బ్రహ్మనాయుడు కాలనీలో ప్రాంతాలను పరిశీలించి ప్రజల అవసరాలను తెలుసుకున్నారు. ఎంపిడిఒ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాసరావు, వైసిపి నాయకులు ఎం.అంజిరెడ్డి, మండల సచివాలయ కన్వీనర్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.నూజెండ్ల మండలంలోని జంగాలపల్లిలో మండల ప్రత్యేకాధికారి బి.రవిబాబు పర్యటించారు. పారిశుధ్య పనులు, విలేజ్‌ క్లినిక్‌, అంగన్వాడీ కేంద్రాలు, జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణం, ఎస్‌డబ్ల్యూపిసి షెడ్‌, సైడ్‌ కాల్వలు నిర్మాణాలను పరిశీలించారు. గ్రామ సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. గ్రామ పరిధిలోని పోలింగ్‌ బూతులకు వెళ్లలేని వారిని గుర్తించి ఓటరు జాబితాలో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి కాఫీ తాగి, వారిని సత్కరించారు. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం 12 గా/డియల్‌ కంటే తక్కువగా ఉన్న బాలికల గృహాలను సందర్శించి, ఆయా బాలికలకు మరియు తల్లిదండ్రులుకు ఐరన్‌ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు గురించి అవగాహన కల్పించారు.
అధికారులతో కలెక్టర్‌ సమీక్ష
ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : గ్రామోదయం/ నగరోదయంతో సత్ఫలితాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీసీ హాల్లో అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌ మాట్లాడుతూ తాను శుక్రవారం అమరావతి మండలంలో పర్యటించానని, జల జీవన్‌ మిషన్‌ ఇంటింటికి నీటి పథకం పనులు దారి మధ్యలో వేశారని, దానిని సరి చేయమని సూచించానని అన్నారు. అధికార్లు సైతం తమ పర్యటన వివరాలను చెప్పారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులు రావడంపై అభినంతనలు తెలిపారు. ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఒలు కమిషనర్లు పాల్గొన్నారు.

➡️