మున్సిపల్‌ అవినీతిపై విజిలెన్స్‌కు ఫిర్యాదు

Mar 7,2024 20:50

ప్రజాశక్తి- బొబ్బిలి : తాగునీటి సరఫరా విభాగంలో జరుగుతున్న అవినీతిని నివారించాలని, అవినీతిపై విజిలెన్స్‌ అధికారులకు ఫిిర్యాదు చేస్తామని టిడిపి కౌన్సిలర్‌ శరత్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన గురు వారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ వాటర్‌ వర్క్స్‌కు నిధులు కేటాయిస్తున్నా తాగునీ టిని సరఫరా చేయడంలో విఫలమవుతున్నారన్నారు. అవినీ తిపై విజిలెన్స్‌ అధికారులకు ఫిిర్యాదు చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండడం లేదన్నారు. తాగునీటి సరఫరా విభాగానికి కౌన్సిలర్లతో కమిటీ వేయాలని వైసిపి కౌన్సిలర్‌ గోవింద్‌ కోరారు. వాటర్‌ వర్క్స్‌లో అవినీతి జరగలేదని చైర్మన్‌ మురళి అన్నారు. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపులకు అద్దె చెల్లించని షాపులకు తాళాలు వేసి కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి, వైసిపి కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. టిడిపి కౌన్సిలర్లు రాంబర్కి శరత్‌, గెంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్‌ షాపులు అద్దెలు వసూళ్లకు ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కుళాయి పన్ను చెల్లించకపోతే కుళాయి కనెక్షన్‌ కట్‌ చేస్తున్న అధికారులు షాపులకు ఎందుకు తాళాలు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపులు అద్దె చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి కౌన్సిలర్లు ఇంటి గోవిందరావు, పాలవలస ఉమా, బొత్స రమణమ్మ కూడా డిమాండ్‌ చేశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ షాపులు పూర్తి సమాచారం తర్వాత సమావేశంలో కౌన్సిల్‌ సభ్యులకు వివరించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. వార్డులలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని కౌన్సిల్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారానికి తీర్మానం చేశారు.అభివృద్ధి పనులపై పర్యవేక్షణ చేయాలిమున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు కోరారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయని, అభివృద్ధి పనులను పర్యవేక్షించి నాణ్యత పాటించాలని సూచించారు. తాగునీరు సంపూర్ణంగా సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా పని చేయడం లేదన్నారు. అవినీతికి ఎవరు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదేళ్లలో అభివృద్ధి చేశామని, రానున్న ఎన్నికల్లో ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి, కౌన్సిల్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

➡️