మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రీనివాస్‌

Mar 12,2024 21:18

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌గా కె.శ్రీనివాస్‌ మంగళవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాస్‌ గతంలో నిడదవోలు మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరము కమిషనర్‌ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు, చైర్పర్సన్‌ వైస్‌చైపర్సన్లు, పాలకవర్గం సూచనలు, సలహాలు మేరకు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ వారి సూచనలను, సలహాలను తీసుకుంటూ విధులు నిర్వహిస్తానని తెలిపారు.సమస్యల పరిష్కారానికి కృషి చేయండి పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌తో అన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌ ఎమ్మెల్యే జోగారావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని దుస్సాలువా తో సత్కరించి మొక్కను అందించారు. పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.

➡️