మున్సిపల్‌ కార్మికుల భిక్షాటన

Jan 8,2024 21:45
ఫొటో : భిక్షాటన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ఫొటో : భిక్షాటన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
మున్సిపల్‌ కార్మికుల భిక్షాటన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : మున్సిపల్‌ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో 14 రోజు సోమవారం మున్సిపల్‌ కార్మికులు పట్టణంలో భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేయడం ఏ మేరకు న్యాయమని ప్రశ్నించారు. తమకు వచ్చే తక్కువ జీతాలతో ఇంటి అద్దెలు, పెరిగిన ధరలతో, వచ్చే జీతాలు చాలక అప్పులు చేసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పర్మినెంట్‌ హామీ ఇప్పటివరకు అమలు చేయలేదని పనికి తగిన జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. పని భారం మాత్రం ప్రభుత్వం తమపై పెంచిందని, డిమాండ్లను పరిష్కరించకుండా ఉన్నందుకే సమ్మె చేస్తున్నామని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మాకిచ్చిన పర్మినెంట్‌ హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.పెంచలయ్య, పోలయ్య, యూనియన్‌ నాయకులు తురక సీనయ్య, బిడదల మహేష్‌, ఒంగోలు రమేష్‌, ఆనందరావు, బాబు, మహిళ నాయకులు జ్యోతి, రాజేశ్వరి, అనిత, నారాయణమ్మ, సుకన్య, తోపాటు కార్మికులు పాల్గొన్నారు.

➡️