మెట్రిక్‌ సిగల్స్‌ లేక గిరిజనులు అవస్థలు

Mar 8,2024 20:37

బయో ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : బయోమెట్రిక్‌ విధానం రద్దుచేసి పాత పద్ధతిలోనే ప్రతి నెలా రేషన్‌ బియ్యం ఇవ్వాలని మండలంలోని నెల్లికెక్కువ గ్రామ గిరిజనులు దుడ్డుఖల్లు డిఆర్‌ డిపో వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ప్రతి నెలలాగనే ఈరోజు కూడా రేషన్‌ బియ్యం కోసం డిఆర్‌ డిపోకు రాగా నెట్వర్క్‌ పనిచేయక ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి పోయామని లబ్ధిదారులు తెలిపారు. రేషన్‌ బియ్యం కోసం బయోమెట్రిక్‌ పడక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో మిగతా పనులు చేయలేక పోతున్నామని సిపిఎం మండల కార్యదర్శి పి.తిరుపతి రావుకు విన్నవించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులతో కలసి ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో నెట్వర్క్‌ సమస్య ఎక్కువగా ఉందన్నారు. సుదూర ప్రాంతాలను వస్తున్న గిరిజనులు చాలాసేపు నిరీక్షించి, నిరాశతో వెనుతిరుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు దృష్టి సారించి పాత విధానంలోనే రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️