మేదరమెట్ల ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి

ప్రజాశక్తి-మేదరమెట్ల: బియ్యం స్మగ్లర్‌లకు గొడుగు పడుతూ దళిత యువకుడు కాకుమాను రవిపై రౌడీ షీట్‌ పెడతానన్న మేదరమెట్ల ఎస్‌ఐ నాగశివారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సస్పెండ్‌ చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్‌ చేశారు. బుధవారం మేదరమెట్ల పోలీస్‌ స్టేషన్‌ ముందు మేదరమెట్ల ఎస్‌ఐ నాగశివారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని, విధుల నుంచి సస్పెండ్‌ చెయ్యాలని దళితులు ప్ల కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు, చప్పిడి వెంగలరావు మాట్లాడుతూ నాగులుప్పలపాడు మండలం తక్కెల్లపాడు గ్రామం నుంచి పేద ప్రజల బియ్యం స్మగ్లింగ్‌ చేస్తున్న లారీని ఆపినందుకు కాకుమాను రవి అనే వైసిపి నాయకుడిపై దాడి జరిగిందన్నారు.

➡️