మే 4న ‘కాశీ నగర్‌ 1947’ విడుదల

Mar 9,2024 23:14

ప్రజాశక్తి-సత్తెనపల్లి : శ్రీగణేష్‌ దేవి మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రకరించిన ‘కాశీ నగర్‌ 1947’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ హైదరాబాదులోని డిజి క్వెస్ట్‌ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర దర్శకులు చిత్తజల్లు ప్రసాద్‌ తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోని కార్తికేయ రెసిడెన్సికి శనివారం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చిత్ర నిర్మాత కదిరి రమాదేవిరెడ్డి ఖర్చుకు వెనకాడకుండా రూపొందిస్తున్నారని అన్నారు. ఈ చిత్రాన్ని మే 4న దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి రోజున విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇందులోని నటీనటులకు మంచి పేరు వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెన్నకేశవ మాస్టారు ప్రధాన విలన్‌ జగన్నాథ పట్నాయక్‌గా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలిపారు. ప్రముఖ న్యాయవాది ఎంవి సుబ్బారెడ్డి ఎస్పీగా, పల్నాడు జిల్లా ఆంధ్రప్రభ మేనేజర్‌ షేక్‌ సైదా సర్కిల్‌ ఇనెస్పెక్టర్‌గా కనిపిస్తారని అన్నారు. మరికొంతమంది సత్తెనపల్లిలోని కళాకారులకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చి ప్రోత్సహించామని చెప్పారు. ఈ సినిమాను ఆదరించి ప్రోత్సహించాలని కోరారు.

➡️