మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 9,2024 23:38
చేస్తూ నిరవధి

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ నిరవధి సమ్మెను ప్రారంభించిన మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలు మంగళవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం పలు మున్సిపాలిటీలు, నగర పంచాయి తీల్లో మోకాళ్లపై నిల్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు. సామర్లకోట రూరల్‌ స్థానిక మున్సిపాలిటీ వద్ద నిర్వ హిస్తున్న నిరసన శిబిరంలో మున్సిపల్‌ కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలనే కోరుతు న్నామని అన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల పరిష్కా రానికి చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారా యణ, సీనియర్‌ నాయకులు ఎలిసెట్టి రామదాసు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు బోచ్చా శ్రీను, కసింకోట ఆనందరావు, గూడుపు దాలమ్మ, మల్లవరపు శకుంతల, గూడుపు అనిత, బంగారు కొండ, తదితరులు నాయ కత్వం వహించారు. పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్లో మున్సిపల్‌ కార్మికుల నిరసన శిబిరం వద్ద వంటావార్పు కార్యాక్రమాన్ని చేపట్టారు. రోడ్లపైనే భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వర్రె గిరిబాబు, శివకోటి అప్పారావు, సింగంపల్లి సింహాచలం, ద్రౌపతి శ్రీను, వేలాపు శివ, భవాని, ముత్యాల సత్యనారాయణ, వర్రె కుమారి, తదితరులు నాయకత్వం వహించారు. పిఠాపురం గొల్లప్రోలులో జరుగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా కార్మికులు నడుముకు చెట్ల కొమ్మలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తున్న మున్సిపల్‌ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని అన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నందీశ్వరరావు, శానిటేషన్‌ వర్కర్స్‌ నాయకులు నీలాపు యేసమ్మ, సిహెచ్‌వి.రమణ, బి.సత్యవతి, రామారావు, పోలమ్మ, బి.సురేష్‌, ఎ.రాజు, సింహాచలం, బి వెంకటేష్‌, రాములమ్మ పాల్గొన్నారు.

➡️