యానాదులకు రెడ్‌ క్రాస్‌ సాయం

ప్రజాశక్తి-బాపట్ల: తుపాను కారణంగా అధిక వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న బాపట్ల పట్టణం 3వ వార్డు రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన 50 యానాది కుటుంబాలకు రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రతినిధులు వంట పాత్రలు, తార్పాలిన్‌ పట్టలు అందజేశారు. మంగళవారం రెడ్‌ క్రాస్‌ జిల్లా కార్యదర్శి బిఎస్‌ నారాయణ భట్టు ఆధ్వర్యంలో యానాదుల నివాసాల వద్దకు వెళ్లి పూరిళ్ల పైకప్పునకు టార్పాలిన్‌ పట్టలు, హైజీన్‌ కిట్లు అందజేశారు. పదిమంది బాలింతలకు వంట పాత్రలను అందించారు. రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సహకారానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారని భట్టు తెలిపారు. కార్యక్రమంలో యంసి సభ్యులు యండి సాదిక్‌, విపత్తుల డివిజన్‌ సమన్వయకర్త రమణబాబు, పి బాలకృష్ణ, భావనారాయణ, రెడ్‌క్రాస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️