యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన

ప్రజాశక్తి-మార్కాపురం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ ఆందోళన కొనసాగింది. ఉద్యోగ, ఉపాధ్యాయు లకు రావలసిన పిఆర్‌సి బకాయిలు, ఎపిజిఎల్‌ఐ క్లోజర్ల బకాయిలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలతో పాటు మెడికల్‌ బిల్లులు, సిపిఎస్‌ ఇన్‌స్టాల్మెంట్లు సుమారు రూ.11,462 కోట్లు తక్షణమే చెల్లించాలనే డిమాండ్‌తో ధర్నా కొనసాగింది. దశలవారీ ఆందోళన మొదలైందని, ఉద్యమం ఉధృతం కాకముందే సమస్య పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ బి శ్రీరాములు, ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి వెంకటేశ్వర్లు, పి అల్లూరిరెడ్డి, నాసరయ్య, చంద్రశేఖరయ్య, శ్రీనివాస నాయక్‌, వివిధ మండలాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.వెంటనే పరిష్కరించాలికనిగిరి: ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం సాయంత్రం కనిగిరి పట్టణంలోని పులి వెంకటరెడ్డి పార్క్‌ వద్ద ఉపాధ్యాయులు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల డిఎ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పిఆర్‌సి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఎస్కే కాజా రహంతుల్లా, టి రమణారెడ్డి, ఏ పోతులూరయ్య, రాము, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.యుటిఎఫ్‌ పోరుబాటకంభం : ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, పిఆర్సి, డిఏ అరియర్స్‌ చెల్లించాలని, ఏపీజీఎల్‌, పిఎఫ్‌ లోన్లు క్లోజర్లు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర సంఘం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ మహాధర్నాలో కంభం ప్రాంతీయ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని కంభం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ మూడు మండలాల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర సంఘ జిల్లా కార్యదర్శి ఐవి రామిరెడ్డి, కంభం మండల ప్రధాన కార్యదర్శి కె సునీల్‌, వి వెంకటేశ్వర్లు, ఐ, తిరుపతయ్య, లక్ష్మి రెడ్డి, డి, ఖాసీంవలి, మూడు మండలాల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️