యుటిఎఫ్‌ పాకెట్‌ బుక్‌ ఆవిష్కరణ

 దాచేపల్లి : మండలంలోని ఉద్యోగులు ఉపాధ్యాయుల వివరాలు ఫోన్‌ నెంబర్లతో కూడిన యుటిఎఫ్‌ ప్యాకెట్‌ బుక్‌ ను డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌, యుటిఎఫ్‌ నాయకులు ఆవిష్కరించారు. నడికుడి రైల్వే స్టేషన్‌ రోడ్‌ లోని కృష్ణ హాస్పిటల్‌లో మంగళవారం ఈ సందర్భంగా ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌కు నాయకులు కృతజ్ఞతలు తెలి పారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి నాగేశ్వరరావు, మండల గౌరవాధ్యక్షులు ఎన్‌ ఏసయ్య, సహాధ్యక్షులు నాగుల్‌ మీరా,సీనియర్‌ నాయకులు శాంతారావు, చాన్‌ బాషా, మస్తాన్‌ వలి, ఎన్వి రాంబాబు, వాసుదేవరావు సాయి బాబా, సుధాకర్‌రెడ్డి, కృష్ణప్రసాద్‌, వెంకటేశ్వర రావు, వేణుగోపాల్‌, రమేష్‌ మాణిక్యరావులు పాల్గొన్నారు.

➡️