యుటిఎఫ్‌ మోడల్‌ టెస్ట్‌ పేపర్స్‌ పంపిణీ

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూటీఎఫ్‌ తరఫున మోడల్‌ టెస్ట్‌ పేపర్‌లను గురువారం పంపిణీ చేశారు. మండలంలో కేజీబీవీ పాఠశాలతో పాటు మొత్తం తొమ్మిది ఉన్నత పాఠశాలలోని 360 మందికిపైగా పదో తరగతి విద్యార్థులకు రూ.27 వేల విలువ గల బుక్స్‌ను అందజేశారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు. టెస్ట్‌ పేపర్స్‌ అందించేందుకు సహకరించిన దాతలు అందరికీ యుటిఎఫ్‌ తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు జె వెంకటరావు, షేక్‌ పాదుషా, జి వేమనారాయణ, హెచ్‌ వీరాంజనేయులు, ఐ కొండయ్య, సిఎస్‌ పురం జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ఖాదరున్నీసా బేగం, జి పోతురాజు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️