యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు

చింతలపూడి : తుపాన్‌ కారణంగా మండలంలో కొంతమేర నష్టం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణహాని జరగలేదని చింతలపూడి మండల స్పెషల్‌ ఆఫీసర్‌ శ్యాంసుందర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగఢవరం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో రెండు గృహాలు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయని, విద్యుత్‌కు సంబంధించి ఏడు స్తంభాలు పడిపోగా వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించటం జరిగిందని అన్నారు. తడిసిన ధాన్యం 852 మెట్రిక్‌ టన్నులు ఉందన్నారు. ఏ రైతు నష్టపోకుండా కలెక్టర్‌ సూచనల మేరకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1,424 ఎకరాల్లో ధాన్యం తడిసిందని, ఈ 1,424 ఎకరాల్లో తడిసిన ధాన్యాన్ని 1,153 ఎకరాల్లో ఇబ్బంది లేకుండా నీరు బయటకు పంపించడం జరిగిందని తెలిపారు. మొక్కజొన్న 145.5 ఎకరాల్లో, వేరుశనగ 140 ఎకరాలు, పొగాకు 20 ఎకరాల్లో దెబ్బతిందని, ఏ రైతుకు నష్టం జరగకుండా ప్రభుత్వంతో చర్చలు జరిపి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

➡️