యువగళం ముగింపు సభకు తరలిరావా

Dec 15,2023 21:53

 ప్రజాశక్తి-చీపురుపల్లి :  ఈ నెల 20న భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున కోరారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నాగార్జున మాట్లాడారు. భోగాపురంలో జరిగే సభకు పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో టిడిపి నియోజకవర్గ నాయకులు పైల బలరాం, రౌతు కామునాయుడు, వెన్నె సన్యాసి నాయుడు, టి.కిరణ్‌ కుమార్‌ రాజు, దన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్‌ బాబు, తాడ్డే సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.యువగళం సభా స్థలి పరిశీలనభోగాపురం : మండలంలోని పోలిపల్లి సమీపంలో చేపడుతున్న యువగళం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. సభా స్థలంతోపాటు పార్కింగ్‌ ఏరియాను పరిశీలించారు. ఏర్పాట్లపై టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుతో చర్చించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి దామచర్ల సత్య, భరత్‌, కోరాడ రాజబాబు, సువ్వాడ రవిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.లోకేష్‌ను కలిసిన అప్పలనాయుడుబాడంగి : అచ్యుతాపురంలో సాగుతున్న యువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కొప్పలవెలమ బిసి సాధికారత పార్లమెంటరీ కన్వీనర్‌ కొల్లి అప్పలనాయుడు కలిసి, వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

➡️