‘యువగళం’ ముగింపు సభకు తరలిరండి

ప్రజాశక్తి-దర్శి: ఈ నెల 20న యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మంచౌదరితో కలిసి పాపారావు మాట్లాడారు. నారా లోకేష్‌ పాదయాత్ర సభ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం బూదాపురం మండలం పొల్లిపల్లి గ్రామం వద్ద భూమాత లేఅవుట్‌లో జరుగుతుందని తెలిపారు. 19వ తేదీ ఒంగోలు నుంచి విజయనగరానికి రాత్రి 9గంటలకు స్పెషల్‌ ట్రైన్‌ బయలు దేరుతుందని, అందరూ గంట ముందుగానే ఒంగోలు చేరాలని సూచించారు. అదే విధంగా రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం ట్రైన్‌లోనే ఇస్తారన్నారు. ఈ యువగళం సభ ముగింపు కాదని, వైసీపీ అక్రమ అరాచక పాలనపై సమరశంఖారావం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, కూరపాటి శ్రీను, శివకోటేశ్వరరావు, నెమిలయ్య, నాయకులు వేణు, నాగరాజు, రమేష్‌, కొండారెడ్డి, సుబ్బారావు, మధు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️