యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం

Jan 30,2024 21:32
ఫొటో : స్టడీ మెటీరియల్‌ను అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : స్టడీ మెటీరియల్‌ను అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం దశల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ప్రణాళిక మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని, నిరుద్యోగ యువత తమకు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. ఎంఎల్‌ఎ మేకపాటి సొంత నిధులతో ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రూప్‌-2 ఉచిత కోచింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు మంగళవారం ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ ఆసరా సంబరాల్లో వారికి మెటిరియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలోని నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారో వలంటీర్ల సహకారంతో వివరాలు సేకరించామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం చేసుకుని ఇప్పటివరకు జాబ్‌ మేళాలు ఏర్పాటు చేశామని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరుద్యోగ యువత కోసం గ్రూప్‌-2 నోటిఫికేన్‌ జారీ చేయడంతో వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉచితంగా కోచింగ్‌, ప్రామాణిక మెటిరియల్‌ అందజేసినట్లు వివరించారు. యువత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, వారికి తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అంతేకాక నియోజకవర్గ యువత కోసం రానున్న రోజుల్లో సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌కు ప్రోత్సాహం అందిస్తామన్నారు. గుంటూరు టార్గెట్‌ ఐఎఎస్‌ అకాడమి వారు అత్యుత్తమ శిక్షణ అందజేస్తున్నారని, ఇక్కడ చదివిన వారిలో నూటికి 75శాతం మంది విజయలక్ష్యం సాధించారని తెలిపారు. అలాంటి అకాడమీ వారి సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా కోచింగ్‌ అందించేందుకు సహకారం అందిస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

➡️