రహదారికి మరమ్మతులు

ముదినేపల్లి : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని చేవూరు గ్రామంలో రహదారి పూర్తిగా పాడై ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రహదారి కృంగిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రజలు క్షతగాత్రులుగా మారుతున్నారు. గురువారం చేవూరు గ్రామ సర్పంచి వల్లభనేని లక్ష్మీ వెంకట్రావు జెసిబితో గుంతలను పూర్చి రోడ్డు చదును చేయించారు.

➡️