రహదారిపై అంగన్‌వాడీల బైఠాయింపు

Dec 23,2023 21:53
ఫొటో : రోడ్డు బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

ఫొటో : రోడ్డు బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు
రహదారిపై అంగన్‌వాడీల బైఠాయింపు
ప్రజాశక్తి-ఉదయగిరి : అంగన్‌వాడీల నిరవధిక సమ్మెకు జిల్లా రైతుసంఘం నాయకులు కాకు వెంకటయ్య, ఎంపిటిసి కాకు విజయ మద్దతు తెలిపారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం 12వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగించి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అంగన్‌వాడీలపై దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం జగన్‌ ప్రభుత్వానికి సరికాదని సిఐటియుగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు మరిచి ఒత్తిళ్లు తేవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా తాళాలు పగలగొట్టిన వారిని అరెస్టు చేయాలన్నారు. జరిగే పార్లమెంటు సమావేశంలో అంగన్‌వాడీల సమస్యలు చర్చించి సమస్యను పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ సమ్మె కొనసాగుతుందన్నారు. అనంతరం కార్యాలయం ఎదుట రోడ్డును దిగ్బంధం చేసి తమ సమ్మె నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షరాలు ప్రమీల, నాయకులు రమాదేవి, ఆవాజ్‌ కమిటీ నాయకులు నాయబ్‌, సిఐటియు నాయకులు కోడె రమణయ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️