రాజకీయాలు వేగంగా మారుతున్నాయి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రంలో రాజకీయ పరిణా మాలు వేగంగా మారు తున్నాయని, వైసిపికి నష్టం కలిగే పరిణామాలు చోటు చేసుకుం టున్నాయని, 175కి 175 సీట్లు సాధిస్తామన్న సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి సొంతపార్టీ ఎమ్మె ల్యేలు ఓడిపోతారన్న పేరుతో అభ్యర్థులను మార్చు కుంటు న్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు వామపక్ష పార్టీలే బిజెపిని ప్రశ్నిస్తూ వచ్చాయని, ఇప్పుడు ఎపిలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిలా కేంద్రాన్ని నిలదీయడం ప్రారంభించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి దాసోహమైపోయాయని చెప్పారు. ఇప్పుడు టిడిపికి మంచి అవకాశం వచ్చిందని, దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. అధికారంలోకి వస్తామని టిడిపి చంకలు గుద్దుకోవద్దని, రాష్ట్రంలో బలం లేని బిజెపితో జతకడితే వామపక్ష, సెక్యులర్‌ సంఘాలు దూరమవుతాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని టిడిపి ఇప్పటికైనా గుర్తించాలని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రశ్నించే వారిని, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీదికి కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఇడి, ఐటి దాడులకు ఉసిగొలుపుతుందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను బిజెపి గుత్తాదిపత్యంతో నిలువరించాలని చూస్తుందని తెలిపారు. బీహార్‌. సిఎం నితీష్‌కుమార్‌ను బెదిరించి బిజెపి భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిందని పేర్కొన్నారు. షర్మిలా వచ్చాక జిల్లాలో మార్పులు చోటుచేసు కున్నాయని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్‌ మధ్య సయోద్య కుదిరితే వైసిపి అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సిపిఎం కేంద్ర కమిటీ సమవేశంలో అనేక విషయాలు చర్చించామన్నారు. బిజెపిని ఓడించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మరుస్తారని హెచ్చరించారు. అధ్యక్ష పాలనవస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలను, నిలదేసే వారిని బిజెపి సహించడం లేదని చెప్పారు. బిజెపిని ఓడించడమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో సిపిఎం, సిపిఐ, మరి కొన్ని వామపక్షపార్టీలు, ప్రత్యేక సాధన కమిటీ, కాంగ్రెస్‌ను సర్దుబాటు చేయడానికి సిపిఎం ముందుకు పోతుందన్నారు. జనసేన బిజెపిని భుజనవేసుకుందని పేర్కొన్నారు. టిడిపి వచ్చేఎన్నికల్లో అవకాశాలను జారవిడుచుకుంటే నష్టపోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో బిజెపి తరుపున పురందరేశ్వరి, విష్ణువర్థన్‌రెడ్డి పోటీచేసినా డిపాజిట్లు రావని చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు. దేశానికి రక్ష మోడీ అనడంలో వాస్తవం లేదని, గతంలో మోడి లేకపోయినా దేశ సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు దేశాన్ని రక్షించుకుంటారని చెప్పారు. బిజెపితో పోతే టిడిపికి సమాధే అని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్‌, కమిటీ సభ్యులు శ్రీనివాసులురెడ్డి, శివకుమార్‌, నగర కార్యదర్శి ఎ.రామమోహన్‌, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఐ.ఎన్‌.సుబ్బమ్మ పాల్గొన్నారు. బిజెపికి రాజకీయ సాధనాలుగా ఇడి, సిబిఐ బిజెపికి రాజకీయ సాధనాలుగా ఇడి, సిబిఐ వాడుకుంటూ ఉందని, ఆ పార్టీ చేతిలో టిడిపి, వైసిపి జనసేన కీలు బొమ్మలుగా మారాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్‌ అన్నారు. సిపిఎం జిల్లా విస్తత సమావేశం గురువారం జిల్లా కార్యాలయంలో ఐ.ఎన్‌.సుబ్బమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ ప్రజల ప్రయోజనాలను కోసం నిలబడే ప్రాంతీయ పార్టీలను ఇవాళ బిజెపి ప్రభుత్వం ఇడి, సిబిఐలను ఉపయోగించి బెదిరించడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. దేశంలో త్వరలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మతోన్మాద పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వామపక్షాల ఐక్యత కోసం సీట్లు సర్దుబాటులు ఉంటాయని స్పష్టం చేశారు.

➡️