రానున్న ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరేద్దాం: వెంకటేష్‌

చీరాల: వైసీపీ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగర వేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ అన్నారు. మంగళవారం మండలం తోటవారి పాలెంలో నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం, గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమా లలో అయన హాజరై మాట్లాడారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు చేసి పథకాలు అన్ని నేరుగా ఇంటి వద్దకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిదే అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఆశాది అంకాలరెడ్డి, మాజీ ఎంపీపీ వైస్‌ నాదెండ్ల కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బండారు శివ పార్వతి, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు దేవరపల్లి అబ్రహం, మహిళా అధ్యక్షురాలు శీలం వేంకటేశ్వరమ్మ, గొలకారం సాంబశివరావు, రావిపాటి లక్ష్మిపతి, మల్లెల సాంబయ్య, పర్వతనే గ్రామ ప్రజలు, గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️