రానున్న రోజుల్లో వెబ్‌, మొబైల్‌ అప్లికేషన్లకు డిమాండ్‌

 తాడేపల్లిరూరల్‌: వెబ్‌,మొబైల్‌ అప్లికేషన్‌లపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ కెఎల్‌ టెక్నాలజీ ఇంక్యుబేటర్స్‌ ఫౌండేషన్‌ సిఇఒ అలోక్‌ గోవిల్‌ అన్నారు. సోమవారం వర్శిటీలోని సెమినార్‌ హాల్‌లో జరిగిన వెబ్‌, మొబైల్‌ అప్లికేషన్‌లపై మూడు రోజుల వర్క్‌షాపు ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా అలోక్‌ గోవిల్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వెబ్‌ సర్వీసు, మొబైల్‌ అప్లికేషన్‌లకు డిమాండ్‌ పెరుగుతుందన్నారు. ఆ రం గాల్లో నూతన ఆవిష్కరణలకు మంచి అవకాశాలు లభి స్తాయని అన్నారు. వర్క్‌షాప్‌లో ఆసక్తి కలిగిన వారికి డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కాన్సెప్ట్‌లపై విలువైన అంతరదృష్టిని అందించడంతో పాటు వెబ్‌, మొబైల్‌ అప్లికేషన్‌ల కోసం పూర్తి-స్టాక్‌ డెవలప్‌మెంట్‌లో ఆచరణాత్మక, ప్రయోగాత్మక శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎసిఐసి సిఇఒ రమణ్‌ కాంత్‌ , కెఎల్‌ టిఫ్‌ మేనేజర్‌ మహేష్‌ గౌడ్‌ , సింగీమాక్సిమ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️