రామ్‌సెంటర్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Feb 10,2024 21:31
ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ రమ్య

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ రమ్య
రామ్‌సెంటర్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
ప్రజాశక్తి-కావలి : ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ పథకం కింద వెంగళరాపు నగర్‌ పి.హెచ్‌.సి., డాక్టర్‌ రామ్‌సెంటర్‌ విశ్వోదయ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. పి.హెచ్‌.సి. వైద్యులు డాక్టర్‌ రమ్య మాట్లాడుతూ క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా మాతృ, శిశు మరణాలు నివారించవచ్చని, రక్త హీనతను అధిగమించాలంటే పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. గర్భిణులు డాక్టర్ల సలహాలు పాటిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలన్నారు. తదుపరి డాక్టర్‌ రామ్‌సెంటర్‌ విశ్వోదయ వారు ఐరన్‌ పొలిక్‌, కాల్సియం, విటమిన్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ రామ్‌సెంటర్‌ డైరెక్టర్‌ కూనం తాతిరెడ్డి, సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి, సూపర్‌వైజర్‌ సుగుణమ్మ, ఎ.ఎన్‌.ఎంలు, ఆశావర్కర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

➡️