రాష్ట్రంలో అధోగతి పాలన

Mar 16,2024 22:19
ఫొటో : మాట్లాడుతున్న వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి
రాష్ట్రంలో అధోగతి పాలన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్రంలో వైసిపి అధోగతి పాలన కొనసాగుతుందని, దోచుకోవడం.. దాచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మాజీ మంత్రి, వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి ప్రారంభం అవుతుందని దానికి నాంది త్రిముఖ నాయకత్వం నేడు చిలకలూరిపేట దగ్గర జరిగే ప్రజాగళం మహాసభ శ్రీకారం చుడుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ పాలన ప్రజాస్వామ్య ఖూని భారత రాజ్యాంగాన్ని క్షీణింప చేయడం, అవినీతి, అక్రమ సంపాదన వీటన్నింటికీ శాశ్వతంగా ఫుల్‌స్టాప్‌ పెట్టడానికే మూడు పార్టీల కలయికతో నేడు సభ ఏర్పడుతుందన్నారు. ఆ సభలో భారతదేశ ప్రధానమంత్రి బిజెపి నాయకులు నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాగే టిడిపి జాతీయ నాయకులు అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జనసేన జాతీయ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ సమిష్టి కృషితో సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖచిత్రం మార్పు చేయడానికి, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు పరిపాలన అంతమొందించడానికి ముగ్గురు నాయకుల సమిష్టి ఆలోచనలతో కూడా వాళ్లు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఇటువంటి అవినీతి అక్రమ సంపాదన ఇవాళ మాఫియా గ్యాంగ్‌గా మారి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో.. వాటన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి రాజ్యాంగ పరిరక్షణను ప్రతిఒక్కరూ కూడా కంకణబద్ధులై నేడు జరిగే సభను దిగ్విజయం చేయడానికి మహామహా నాయకులందరూ కూడా వస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు. రాబోయే పార్లమెంటు, శాసనసభ ఎన్నికలలో స్పష్టమైన నిర్ణయానికి ప్రజలకు సంకేతంగా నిలవబోతుందని తెలియజేస్తున్నానన్నారు. చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్‌లో తమతో మాట్లాడారని, కాన్ఫరెన్స్‌లో వారు చిన్న వెసులుబాటు ఇచ్చారని తెలిపారు. గతంలో అందరమూ సభకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. సభలో ఇచ్చే సందేశాన్ని ప్రజలందరికీ వివరించాలని తెలిపినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచార ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మండలాల వారీగా, గ్రామాల వారీగా మున్సిపల్‌ పరిధిలో వార్డుల వారీగా నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టామన్నారు. దానికి పార్లమెంట్‌ సభ్యులు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు, అబ్జర్వర్లు ఆత్మకూరు పార్టీ నాయకత్వం అంతా కలిసి ఆ కార్యక్రమం రూపొందించుకొని కార్యాలయం ప్రారంభంతోనే ఎన్నికల ప్రణాళికను ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో అబ్జర్వర్‌ బుల్లెట్‌ రమణ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, టిడిపి మండల అధ్యక్ష కార్యదర్శులు, కేత విజయభాస్కర్‌ రెడ్డి, సుంకర పెంచలయ్య చౌదరి, టిడిపి అధికార ప్రతినిధి చండ్రా వెంకటసుబ్బ నాయుడు, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, మీరా మొహిదీన్‌ తదితరులున్నారు.

➡️