రాష్ట్రస్థాయి పోటీలకు మైనంపాడు విద్యార్థులు

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు మండలంలోని మైనంపాడు గవర్నమెంట్‌ హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని పీఈటి తిరుమలశెట్టి రవికుమార్‌ (హాకీ రవి) తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తమ హైస్కూల్‌ ప్లస్‌ నుంచి అండర్‌-19 విభాగానికి ఏ భవ్యశ్రీ, యు అనిత, కే కళ్యాణి ఎంపికయ్యారని బుధవారం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో హెడ్‌ మాస్టర్‌ డివిఎల్‌ నరసింహారావు తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 14,15,16 తేదీలలో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్‌ ఆకుల బ్రహ్మయ్య, గ్రామా భివృద్ధి కమిటీ చైర్మన్‌ గొడుగు మస్తాన్‌, హైస్కూల్‌ ప్లస్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను పీఈటి తిరుమలశెట్టి రవికుమార్‌లను, స్కూల్‌ గేమ్స్‌ జిల్లా సెక్రెటరీ కే వనజ అభినందించారు.

➡️