రాష్ట్ర ప్రగతి కోసం టిడిపికి ఓటేయాలి

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విజరు, రాజు, తాతయ్యబాబు, మల్లునాయుడు తదితరులు

ప్రజాశక్తి-వడ్డాది

రాష్ట్ర ప్రగతి, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతీ యువకులు మొట్ట మొదటి ఓటును టిడిపికి వేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజరు పిలుపునిచ్చారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో ‘యువతా మేలుకో- ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌’ పోస్టర్లను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తొలి ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని విద్యాలయాల వద్ద తొలి ఓటర్లకు పార్టీ కేడర్‌ అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. చోడవరం నియోజకవర్గంలో 22,800 మంది తొలి ఓటర్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గం ఇన్చార్జి బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, నాయకులు గూనూరు మల్లునాయుడు, కోటేశ్వరరావు, అప్పలనాయుడు, అప్పారావు, కోట నీలవేణి, ముచ్చకర్ల భవాని, సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

➡️