రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకు రావాలి: ఉగ్ర

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత ముందుకు రావాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మండలంలోని అరవేముల గ్రామానికి చెందిన 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. వారిని ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరివేముల గ్రామానికి చెందిన చోడ తిరుపతిరెడ్డి, జక్కం వెంకటేశ్వర్‌రెడ్డి, కుర్ర చిన్నవెలుగొండయ్య, రుసుం ఆలీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మనబోయిన రంగయ్య సహకారంతో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే యువత చైతన్యవంతులై ప్రజల్లో మార్పు తీసుకుని వచ్చి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా పని చేయాలని అన్నారు. టిడిపిలోకి భారీగా వలసలు వస్తున్నారని, కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎన్‌సి మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు, చెరుకుపల్లి వెంకటరెడ్డి, ఆరివేముల గ్రామానికి చెందిన పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️