రిలే నిరాహార దీక్షలు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బి.కొత్తకోటలో ఆవుకు వినతిపత్రం ఇచ్చిన నిరసన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ అంగన్వాడీలకు ప్రభుత్వం తెలంగాణ కన్నా అదనంగా రూ.వేయి ఎక్కువ ఇస్తాం, మూడు నెలల తర్వాత వేతనాలు పెంచుతాం, సమ్మె చేయడం కరెక్ట్‌ కాదు సమ్మె విరమించండి అంటూ కేవలం మాటలతో సరిపెట్టి, శాసన సభ్యులకు మూడు సార్లు వేతనం పెంచుకొన్నారని కావున మాటలు అంగన్వా డీలకు, మూటలు మీ ప్రజాప్రతినిధులకా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఆర్‌డిఒ ఆఫీసు ఎదుట ప్రాజెక్టులలోని అంగన్వాడీల సమ్మె 18వ రోజు నిరాహార దీక్షల సందర్బంగా శిబిరానికి హాజరై అంగన్వాడీల సమ్మె నుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి 18 రోజులుగా సమ్మె చేస్తుంటే చూసిచూడనట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయని, అంగన్వాడీల కిచ్చే వేతనం, బిల్లులు సకాలంలో రాక అప్పులతో మానసిక వేదన పడుతున్నారన్నారు. ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 ఇవ్వకపోయినా మీరిచ్చిన మాట ప్రకారం తెలంగాణ అంగన్వాడీల కన్నా అదనంగా రూ.వెయ్యి ఎక్కువ ఇస్తానని ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి పనిభారం పెంచి జీతాలు పెంచకపోవడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. వీరబల్లి, కలకడ ప్రాంతాలలో వైసిపి నాయ కులే సమ్మె విరమించమని రాజకీయ వేధింపులు ఆపకపోతే సమ్మె ఉధతం చేస్తామని హెచ్చరించారు. శాసనసభ్యుల సిపారసు లేకుండా అంగన్వాడీ ఫోస్టులు కానీ, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వడంలేదని వీరికి వచ్చే ఎన్నికలలో బుధ్ధి చెప్పాలన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన గుడ్లు, పాలు పౌష్టికాహారం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంటూ జీతం తక్కవిచ్చి, సంక్షేమ పథకాలకు అనర్హులుగా ముద్రవేసి అంగన్వాడీలను ఆర్థిక సామాజిక దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. నాణ్యమైన సెల్‌ పోన్‌లు ఇవ్వలేదన్నారు. ప్రజలకు సేవ చేస్తూ తమ పిల్లలను సరైన చదువులువైద్య అవసరాలు భారమై జీతాలు పెంచమని గత ఐదేల్లుగా విన్నవించినా ఫలితం లేదని, అంగన్వాడీల పోరాటాలను చులకన చేసిమాట్లాడితే చంద్రబాబును మాజీ సిఎంగా 13 ఏళ్ల అధికారానికి దూరం చేసిన అంగన్వాడీల పోరాట చరిత్రను ప్రభుత్వానికి గుర్తు చేశారు. భవిష్యత్‌లో అంగన్వాడీల ఉద్యమాన్ని జీతాలు పెంచే వరకు లబ్ధిదారులతోనూ ప్రజాసంఘాలు రాజకీయ పార్టీల మధ్ధతు కూడగట్టి సమ్మెను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, లక్కిరెడ్డిపల్లి ప్రాజెక్టు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.సిద్ధమ్మ, డి.భాగ్యలక్ష్మి, పి.బంగారుపాప, పి.ఖాజాబి, అరుణ, సుమలత, కవిత, సబీనా, మంజుల, భూదేవి, పద్మజ, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మినీ వర్కర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రైల్వేకోడూరు : అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు శ్రీ రమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాదకుమారి, మండల కార్యదర్శి జి.పద్మ వెన్నెల శిరీష, ఎఐటియుసి నాయకులు సరోజ, నిర్మల, నాగమణి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారికి గౌరవ అధ్యక్షులు వనజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌. చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు జాన్‌ ప్రసాద్‌, సిపిఎం మండల కార్యదర్శి యానాదయ్య, సిఐటియు మండల కోశాధికారి హరి నారాయణ, సంఘీభావం తెలియజేశారు. రాజంపేట అర్బన్‌ : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరేవరకూ పోరు ఆగదని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తేల్చి చెప్పారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు విజయ, అమరావతి, శివరంజని, హేమలత పాల్గొన్నారు. ఆవుకు వినతిపత్రం సమర్పణ : బి.కొత్తకోట : తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఆవుకు వినతి పత్రం అందజేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు పాల్గొన్నారు. మదనపల్లి : అంగన్వాడీలు నిరసనను కొనసాగించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు హరింద్రనాథ్‌ శర్మ, మధురవాణి, గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, శ్యామవేణి, ఈశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి :అంగన్వాడీల దీక్షలకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, అంగన్వాడీలు సుకుమారి, ఓబులమ్మ, లక్ష్మిదేవమ్మ, ప్రభావతి, రెడ్డెమ్మ, శ్రీవాణి, విజయ, చిట్టెమ్మ, ఇరగమ్మ, రుక్మిణమ్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️