రూ.1.47 కోట్ల సరుకు, సామగ్రి స్వాధీనం

Mar 15,2024 22:46

గోదాములో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు
ప్రజాశక్తి – మేడికొండూరు :
మండలంలోని పేరేచర్లలో నకిలీ ఆర్గానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై విజిలెన్సు – ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులకు శుక్రవారం మెరుపు దాడులు చేశారు. రూ.కోటీ 47 లక్షల 73 వేల 476 సరుకును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారి కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో విజిలెన్స్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల గ్రామంలోని నికిత కిసాన్‌ సేవా కేంద్రంలో తనిఖీ చేపట్టారు. ఫరమ్‌ వ్యాపారికి పురుగు మందులు, ఎరువులు విక్రయానికే అనుమతి ఉండగా బిల్లులు, ఇన్వాయిసులు లేకుండా రసాయనిక ముడిపదార్దములు తెచ్చి, సేంద్రీయ ఉత్పత్తుల ముసుగులో రసాయనాలు కలిపి నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనుమతి లేని 5 రకాల ముడిపదార్థాలను గుర్తించారు. ఇక్కడే మందులను తయారు చేసి అమ్మటానికి కావలసిన అట్టపెట్టెలు, ఖాళీ సీసాలు, ప్యాకింగ్‌ సామగ్రి, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ శివప్రసాద్‌ అనే వ్యక్తిపై ఇన్వాయిస్‌ చేయబడి ఉన్నట్లు గుర్తించారు. గొదాములోని రూ.కోటీ 47 లక్షల 32 వేల 256 విలువగల సేంద్రీయ పదార్తాళు, రూ.41,220 విలువగల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. సంస్థ యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయించాలని మండల వ్యవసాయ శాఖాధికారి ఎం.నాగరాజును ఆదేశించారు. తనిఖీల్లో విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మ్‌ెం అగ్రికల్చరల్‌ అధికారి కె.రమణకుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రామచంద్రయ్య, విఆర్‌ఒ, సిబ్బంది పాల్గొన్నారు.

➡️