రూ.1.50 లక్షల విరాళం అందజేత

ప్రజాశక్తి-దర్శి : తాళ్లూరు మండలం తూర్పుగంగవరం వద్ద ఉన్న గుంటి గంగ భవాని అమ్మవారి ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దూపనైవేధ్యం కోసం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ రూ.1.50 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆలయ ధర్మకర్త నన్నెబోయిన వీరాంజనేయులకు మంగళవారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వెంకాయమ్మను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్‌రెడ్డి, నాయకులు గుజ్జల యోగిరెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️