రూ.100 కోట్లతో గీతం ప్రాంగణాలలో ‘మూర్తి’ పరిశోధనా కేంద్రాలు

'మూర్తి' పరిశోధనా కేంద్రాలు

వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం

ప్రజాశక్తి – మధురవాడ : విజ్ఞాన శాస్త్ర పరిశోధనల బలోపేతం, అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్‌ సాధనే లక్ష్యంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాలలో రూ.100 కోట్లతో మూర్తి పరిశోధనా కేంద్రాలను అభివృద్ది చేస్తోందని వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం తెలిపారు. సోమవారం స్థానిక . గీతం మూర్తి పరిశోధన కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ, బోధనతో పాటు పరిశోధనలలోనూ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నామన్నారు. అత్యున్నత స్థాయి పరిశోధనలు నిర్వహణకు వివిధ కేంద్ర పరిశోధనా సంస్థలలో కీలక స్థానాలలో పనిచేసిన వారిని డీన్‌లుగా, విశిష్ట ప్రొఫెసర్‌లుగా, అలాగే పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధకులను ఏడాదిగా గీతం ప్రాంగణాలలో నియమిస్తూ వచ్చామని వెల్లడించారు. గీతంలో పరిశోధకులుగా (పిహెచ్‌డి) ప్రవేశం పొందే వారిలో ప్రతిభ గలవారిని గుర్తించి మూర్తి ఫెలోషిప్‌ను కూడా అందజేస్తున్నామన్నారు.28న బెంగళూరు గీతం ప్రాంగణంలో మూర్తి పరిశోధన కేంద్రం ప్రారంభం: ఈ నెల 28న బెంగళూరు గీతంప్రాంగణంలో మూర్తి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు విసి వెల్లడించారు. గీతం వేదికగా వివిధ పరిశ్రమలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపద్యంలో వారి అవసరాలకు అనుగుణంగా 13 అంశాలపై పరిశోధన ప్రయోగ శాలలు నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. వాటిలో డ్రోన్‌ టెక్నాలజీ, భూసారం, జియో-స్పేషియల్‌, స్మార్ట్‌ అగ్రికల్చర్‌, నానో సెన్సార్‌ ఫొటోనిక్స్‌, బయోసెన్సార్‌. సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ వెహికిల్‌. అప్లైడ్‌ ఎలక్ట్రోమాగటిక్‌. 3డి ప్రింటింగ్‌ డిజైన్‌. ఆల్జీబ్రా, జియోమెట్రీ. క్వాంటమ్‌ ఇన్ఫోకామ్‌. నెక్ట్‌ జనరేషన్‌ కనెక్టివిటీ రీసెర్చి ల్యాబ్‌లకు సంబంధించి పరిశోధనలు చేపట్టనున్నట్లుం విసి తెలిపారు. వీటి కోసం పరిశ్రమలతో చర్చిస్తున్నామన్నారు.

➡️