రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంకు ప్రారంభం

Mar 5,2024 21:34

 ప్రజాశక్తి-చీపురుపల్లి  : రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లిలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లడ్‌ బ్యాంకును ఆయన మంగళవారం ప్రారంభించారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్‌ సమకూర్చిన రూ.90లక్షలు సిఎస్‌ఆర్‌ నిధులతో ఈ బ్లడ్‌బ్యాంకును నిర్మించారు. అవసరమైన పరికరాలను కూడా అందజేశారు. సామాజిక బాధ్యత నిధులతో బ్లడ్‌బ్యాంకును నిర్మించిన అరబిందోను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అరబిందో చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ బ్లడ్‌ బ్యాంకు వల్ల ఏడాదికి సుమారు 3వేల మందికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు నిలిపేందుకు ఆస్కారం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, డిసిహెచ్‌ఎస్‌ గౌరీశంకర్‌, ఆర్‌డిఒ బి.శాంతి, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసరావునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాయక్‌, అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.నిత్యానందరెడ్డి, డైరెక్టర్‌ పి.శరత్‌ చంద్రారెడ్డి, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షులు కెఆర్‌డి ప్రసాద్‌, కార్యదర్శి కె.సత్యం, మేనేజింగ్‌ కమిటీ సభ్యులు బివి గోవిందరాజులు, రెడ్డి రమణ, సర్పంచ్‌ ఎం.సుధారాణి తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఫంక్షన్‌ హాళ్లు గ్రామాల్లో ఏర్పాటు ముదావహం రామభద్రపురం : గ్రామాల్లో ఫంక్షన్‌ హాళ్లు ఏర్పాటు చేయడం ముదావహం అని రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొట్టక్కి గ్రామంలో మాజీ ఎంపిపి అప్పి కొండ శ్రీరాములునాయుడు కుటుంబ సభ్యులు,గ్రామస్తుల సహకారంతో నిర్మించిన ఎఎస్‌ఎన్‌ కళ్యాణ మండపాన్ని మంత్రి బొత్స, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే ఎస్‌వి చిన అప్పలనాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పికొండ సత్యం నాయుడు,శాంతమ్మల పేరుతో విశాలమైన భవనాన్ని అన్ని వసతులతో నిర్మించి గ్రామస్తులకు తన చేతుల మీదుగా అంకితం చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు, వైసిపి మండల నాయకులు పాల్గొన్నారు.

➡️