రేషన్‌ నూరు శాతం పంపిణీ చేయాలి:డిఎస్‌ఒ విలియమ్స్‌

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ప్రతి కార్డుదారునికి రేషన్‌ అందేలా, నూరు శాతం పంపిణీ జరిగేలా ఎండియూలు కృషి చేయాలని బాపట్ల జిల్లా డిఎస్‌ఓ విలియమ్స్‌ ఆదేశించారు. మంగళవారం చెరుకుపల్లి మండల పరిధిలోని రేషన్‌ డీలర్లు, ఎండియులతో జరిగిన సమీక్ష సమావేశంలో డిఎస్‌ఓ పాల్గొని సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 90 శాతం వరకు పంపిణీ జరుగుతోందని, అయితే ప్రతి కార్డుదారునికి రేషన్‌ పంపిణీ జరిగేలా చూసి 100 శాతం పూర్తి చేయాలని ఆయన కోరారు. ఎండీయూలు, రేషన్‌ డీలర్లు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. సమావేశంలో సిఎస్డిటీలు ఓంకార్‌, గీతాకృష్ణ, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️