రేషన్‌ సరుకులు భద్రం

Feb 21,2024 21:31

 ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం  : గోదాములలో సరుకులను తడి లేని ప్రదేశాల్లో నిల్వ చేస్తే సరుకులు పాడవకుండా భద్రంగా ఉంటాయని సివిల్‌ సప్లై సంస్థ విశాఖ జోనల్‌ మేనేజర్‌ ఎన్‌ .సుబ్బరాజు తెలిపారు. బుధ వారం గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఆవరణలో ఉన్న ఎంఎల్‌ఎస్‌ గోదాములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాములకు ముందు వచ్చిన సరుకులను ముందుగా పంపించాలని, తరువాత వచ్చిన సరుకులను దశలవారీగా డిపోలకు పంపించాలని సూచించారు. సరుకులను సకాలంలో డిపోలకు సరఫరా చేయాలని, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన గోదాంలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఎల్‌ఎస్‌ గోదాం సూపరింటెండెంట్‌ ఎం.సాంబశివరావు ఉన్నారు.

➡️