రైతులకు మద్దతుగా నిరసనలు

ప్రజాశక్తి – పొదిలి : రైతులకు మద్దతుగా ఢిల్లీ నిర్వహించ తలపెట్టిన కిసాన్‌-మజ్దూర్‌ మహాపంచాయితీకి మద్దతుగా సిఐటియు నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రమేష్‌ మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాల రద్దు సందర్భంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ బయలు దేరిన రైతులను నిలువరించి అత్యంత పాశవికంగా దాడి చేయడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు. దేశంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవాలంటే మోడీ వారి మిత్రులను ఓడించి కార్పొరేట్‌ విధానాలు వ్యతిరేకించాలన్నారు. అప్పుడే రైతాంగం కోరుతున్న చట్టాలను సాధించుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.చీమకుర్తి : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ నిర్వహిస్తున్న చలో ఢిల్లీకి మద్దతుగా రైతు,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి కె.చిన్నపురెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో రైతుల పోరాటం సందర్బంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. రెండేళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నల్లచట్టాలు దొడ్డిదారిన అమలు చేస్తున్నట్లు తెలిపారు. సిఐటియు నాయకుడు పూసపాట ివెంకటరావు మాట్లాడుతూ కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని, దాన్ని మద్దుతుదారులను రాబోయే ఎన్నికలల్లో ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు బెజవాడ శ్రీనివాసరావు , నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీల్లూరి కృష్ణయ్య, శ్రీను, వ్యవసాయ కార్మికసంరఘం నాయకులు ఎస్‌.ఆదినారాయణ, పులి ఓబులరెడ్డి, సిఐటియు నాయకులు శంకర కనకరాజు పాల్గొన్నారు. శింగరాయకొండ : రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తలపెట్టిన చలో ఢిల్లీకి మద్దతుగా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి కందుకూరు రోడ్డు వరకు రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు కె. వీరారెడ్డి టంగుటూరి రాము ఆర్‌.మోహన్‌, కె.నాంచార్లు, ఎస్‌కె. సుల్తాన్‌, షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌, బాలాజీ రెడ్డి,అంబటి కొండలరావు, డి.నాగేశ్వరరావు పులగుర కష్ణయ్య, కె. బాలకోటయ్య, ఐ.రవిబాబు, పర్రె నాగరాజు, మన్నె శ్రీనివాసులు, ప్రసాదు చిమటా శ్రీను పాల్గొన్నారు. మార్కాపురం రూరల్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తలపెట్టిన చలో ఢిల్లీకి మద్దతుగా ఉభయ రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో రైతులకు ఇచ్చిన హామీలు, స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా బాల నాగయ్య, నాయకులు దగ్గుపాటి సోమయ్య, సిఐటియు నాయకులు డీకే.రఫీ, డివైఎఫ్‌ఐ నాయకులు ఏనుగుల సురేష్‌ కుమార్‌, సిపిఎం నాయకులు జవ్వాజి రాజు, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమారెడ్డి, ఉపాధ్యక్షుడు దుగ్గంపూడి పిల్లి కొండయ్య, అందే నాసరయ్య ఏరువ పాపిరెడ్డి, గంగిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, ఓర్సు తిరుపతయ్య, ఓర్సు అడివయ్య తదితరులు పాల్గొన్నారు. కొండపి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో తలపెట్టిన రైతు పోరాటానికి మద్దతుగా కొండపిలో సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు కెజి.మస్తాన్‌ మాట్లాడుతూ 2021 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్తకిసాన్‌ మోర్చా నాయకులు వై.చంద్రశేఖర్‌, ఆర్‌.లక్ష్మి, ముప్పరాజు చిన్నబ్రహ్మయ్య, ఏసు పోగు రూబెన్‌, దేపూరి బ్రహ్మయ్య, శ్రీనివాసులు,బ్రహ్మారెడ్డి దాసుపాల్గొన్నారు. యర్రగొండపాలెం : మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవుండ్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న రైతు మహా ధర్నాకు మద్దతుగా స్థానిక పూల సుబ్బయ్య విగ్రహం వద్ద గ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు కోసం రైతులు 13 నెలల పాటు నిర్వహించిన చారిత్రాత్మక పోరాట విరమణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నయ్య,కష్ణగౌడ్‌, సాంబయ్య, విస్వరూపాచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️