రైతులను పూర్తిగా ఆదుకోవాలి

Dec 13,2023 22:47
టిడిపి నాయకులు మెట్ల

ప్రజాశక్తి – ఏలేశ్వరం

పంట నష్టపోయిన రైతు లను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. బుధవారం మండలం లోని ఎర్రవరం గ్రామంలో టిడిపి నియో జకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరుపుల సత్యప్రభతో కలిసి నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాను ప్రభావంతో వరి పనులు మొలకలు వచ్చి, ధాన్యం గింజలు కుళ్ళిపోయాయని అన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పండించిన పంట నీళ్ళ పాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇంతటి నష్టం జరిగిన సిఎం జగన్‌ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. చంద్రబాబు హయాంలో తుపాన్‌ వంటి సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం ఎలా స్పందించిందో ఒక్కసారి రైతులు గుర్తు చేసుకోవాలన్నారు. ఈ పర్యటనలో టిడిపి నాయకులు మెట్ల రమణబాబు, బోళ్ల వెంకటరమణ, ఎంపిపి గొల్లపల్లి బుజ్జి, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి పాల్గొన్నారు.

➡️