రైతుల ధర్నాకు మద్దతుగా నిరసన

Feb 20,2024 21:25

ప్రజాశక్తి – కొమరాడ : ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు స్థానిక రైతులు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మధుసూదనరావు, శివున్నాయుడు కోరారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కొమరాడలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సోమనాథ్‌ సిఫార్సు మేరకు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతులు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు మద్దతు పలుకుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

➡️