రైతుల సంక్షేమమే ధ్యేయం

Jan 27,2024 21:46
మాట్లాడుతున్న నిరంజన్‌బాబు రెడ్డి

మాట్లాడుతున్న నిరంజన్‌బాబు రెడ్డి
రైతుల సంక్షేమమే ధ్యేయం
ప్రజాశక్తి-నెల్లూరు రైతుల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌ బాబు రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో నిరంజన్‌ బాబు రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల సంభవించిన మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా నష్ట పోయిన రైతులకు 3,4 రోజుల్లోనే 80 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేసి జిల్లా యంత్రాంగం రైతాంగానికి అండగా నిలిచినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూరియా కొరత అంటూ కొన్ని పత్రికల్లో అసత్య వార్తలు రాయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. అసత్య వార్తలతో రైతులు కంగారు పడొద్దని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎం.వి. సుబ్బారెడ్డి, పశు సంవర్ధక శాఖ జెడి మహేశ్వరుడు, జిల్లా సహకార శాఖాధికారి సుధాభారతి, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త యు వినీత, నాబార్డ్‌ డిడిఎం రవి సింగ్‌, ఏపిఎంఐపి పిడి శ్రీనివాసులు, ఏపీ సీడ్స్‌ డిస్టిక్‌ మేనేజర్‌ పి సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖ ఏడీలు నర్సోజిరావు, శేషగిరి, ఇరిగేషన్‌, మత్స్య శాఖల అధికారులు, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

➡️