రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

Mar 11,2024 21:30

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా వారి సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్‌బికెలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని పెదబుడ్డిడిలో రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, అలాగే తురకనాయుడువలసలో మరో రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమమే తమ ధ్యేయమని, వీరిని అన్ని విధాలా ఆదుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి ఎం.శశికళ, ఉషారాణి, గౌరీశంకర్రావు, ఎం.కిషోర్‌, వైస్‌ ఎంపిపి సంపత్‌కుమార్‌, పెద్దబుడ్డి సర్పంచ్‌ సీమల సుజాత, ఉపసర్పంచ్‌ రేవళ్ల తిరుపతినాయుడు, ఎంపిటిసి సభ్యులు ఆర్‌.జ్యోతిశ్రీ, తురక నాయుడువలసకు చెందిన భీమవరపు సింహాచలం, కెంగువ వెంకటి నాయుడు, సింహాచలం మాస్టారు, కారు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదనపు భవనం ప్రారంభం కొమరాడ : విద్యార్థుల సౌకర్యాల మేరకు అదనపు భవనాన్ని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మండలంలోని నాగావళి నది ఆవల గల వన్నాం లో కొత్తగా నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాల అదనపు భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నాడు నేడు పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో కూడా పక్కా భవనాలు నిర్మాణాలు చేపట్టి పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని అన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుకూలంగా ఇంగ్లీష్‌ మీడియం ఏర్పాటు చేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని, కావున పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి ఉత్తీర్ణత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి శ్యామల, సర్పంచ్‌ విజయలక్ష్మి, ఎంఇఒ జామి నారాయణస్వామి, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️