రోడ్డు పనులకు బ్రేకులు

Mar 9,2024 23:11

అధ్వానంగా తయారైన రహదారి
ప్రజాశక్తి – బెల్లంకొండ :
ఏళ్ల తరబడి తాము పడుగున్న ప్రయాణ ప్రయాసలు ఇక ఉండబోమని జనం సంతోషించినా అంతరం వారి ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. మండలంలోని మారుమూలు గ్రామమైన వెంకటాయపాలెం రహదారి దెబ్బతిని ప్రయాణం కష్టమవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు పలుమార్లు విన్నవించుకున్నారు. దీంతో మన్నెసుల్తాన్‌పాలెం నుండి వెంకటపాలేనికి 14 కిలోమీటర్ల పాటు రూ.3.14 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైంది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ రెండు వారాల కిందట పనులనూ ప్రారంభించారు. అయితే కిలోమీటరు మాత్రమే రహదారిని వేసి తర్వాత పనులు ఆపేశారు. దీనికితోడు రోడ్డు వేసే పేరుతో రహదారి మొత్తాన్ని గుంతలమయం చేయడంతో గతం కంటే మరీ కష్టంగా ప్రయాణం మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ మార్గంలో రాకపోకలంటే భయంగా ఉందని, ఒళ్లు హూనమవుతోందని, గర్భిణులు, ఇతర రోగులు, వృద్ధుల కష్టాలైతే చెప్పనలవి కాదని గ్రామస్తులు వాపోతున్నారు. తమ వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహనదార్లు ఆవేదనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.

➡️