రోడ్డు ప్రమాదాలను నివారించాలి

Feb 6,2024 21:52
ఫొటో : పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఆర్‌డిఒ మధులత

ఫొటో : పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఆర్‌డిఒ మధులత
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆత్మకూరు ఆర్‌డిఒ కె.మధులత పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు ఆర్‌డిఒ కార్యాలయంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములుతో కలిసి 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాల నడపాలని, తద్వారా ప్రమాదాలు నివారించవచ్చన్నారు. అనంతరం పట్టణంలోని అభిరాం హాస్పిటల్‌ ప్రాంగణంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ చేతుల మీదుగా గుడ్‌ సమారిటన్‌ అంశంపై వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాంతో పార్టీ ప్రమాదాన్ని చూసి చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మనం రోడ్డు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే హాస్పిటల్లో చేర్పించి ప్రమాదం నుండి కాపాడాలని, లేదా పోలీసులకు వెంటనే తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు, వారి సిబ్బంది, అభిరామ్‌ ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️