లబ్ధిదారులకు రూ.2.80 కోట్ల లబ్ధి

Nov 23,2023 22:20 #కలెక్టర్‌
మెగా చెక్‌ను

ప్రజాశక్తి – కాకినాడవైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకాల్లో 398 మంది లబ్ధిదారులకు రూ.2.80 కోట్ల లబ్ది చేకూరిందని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్‌ నాలుగో విడత ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి ఎంపి వంగా గీత, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, ఎంఎల్‌ఎలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, పెండెం దొరబాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, రాష్ట్ర అయ్యరిక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి, మాజీ మేయర్‌ సుంకర శివ ప్రసన్నలతో కలిసి వివిధ ప్రాంతాలకు చెందిన నూతనంగా వివాహాలైన జంటలతో కలిసి వర్చువల్‌గా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మెగా చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకాల ద్వారా ఇచ్చే నగదు ప్రోత్సాహం వివాహ కార్యక్రమాల వల్ల కలిగే ఆర్థిక భారం తల్లిదండ్రులకు చాలావరకు తగ్గుతుం దన్నారు. ప్రత్యేకంగా ఈ పథకం యొక్క నియమ, నిబంధనలు పటిష్టంగా ఉండడం వల్ల బాల్య వివాహాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఆడబిడ్డ తప్పనిసరిగా పదో తరగతి చదవాలనే నిబంధన ఫలితం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జెడి డివి.రమణ మూర్తి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, డిఎల్‌డిఒ పి.నారాయణ మూర్తి పాల్గొన్నారు.

➡️