లే అవుట్‌ ఏర్పాటులో అక్రమాలు

Jan 11,2024 21:52
అక్రమాలు జరిగిన లే అవుట్‌

అక్రమాలు జరిగిన లే అవుట్‌
లే అవుట్‌ ఏర్పాటులో అక్రమాలు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరులే అవుట్‌ ఏర్పాటులో అధికారులు వ్యవహరించిన తీరుకు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండంలోని నరుకూరు పంచా యతీ పరిధిలోని సర్వే నంబర్‌ 1 లోని 4.07 ఎకరాల భూమిలో పన్నెండేళ్ల కిందట రాయల్‌ సిటీ పేరుతో ఒక లే అవుట్‌ వెలిసింది. ఆ లే అవుట్‌ ఏర్పాటుకు అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు.ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన లే అవుట్‌ కావడంతో ఇళ్ల నిర్మాణాల కోసం పలువురు ప్లా ట్లు కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో ఏ శాఖ అధికారులు ఈ రా యల్‌ సిటీ లే అవుట్‌ కు అనుమతులు మంజూ రు చేశారో ఇప్పుడు అదే శాఖ అధికారులు అదే రాయల్‌ సిటీ లే అవుట్‌ అక్రమం అంటూ అభ్యంతరం చెబు తున్నారు. ఆ లే అవుట్‌ విషయంలో అధికారులు ఆడుతున్న నాటకంలో ప్లాటు కొనుగోలు చేసిన వారు పావులుగా మారారు.అమలుకాని జిఒ నెంబర్‌ 596 అసైన్డ్‌, జలవనరులు, పోరంబోకు, స్థలాలక అనుభవదారులకు యాజమాన్యం హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌ 596 ను తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం రాయల్‌ సిటీ లే అవుట్‌ ప్రభుత్వ భూమి అయినా 12 ఏళ్లు అనుభవిస్తున్న వారికే యా జమాన్యం హక్కులు ఉంటాయి. అనుభవదా రుల నుంచి ఏదేని ఒక ఆధారాన్ని పరిగణలోకి తీసుకొని రెగ్యులర్‌ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఆ స్థలాలపై మూడు రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయి. అప్పటి అధికారులు డి-ఫామ్‌ పట్టా లు కూడా పంపిణి చేసి ఉనాన్రు. అన్ని ఆధా రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా వున్నప్పటి కీ ఆ ఇంటి నివేశన స్థలాల విషయంలో రెవన్యూ శాఖ ఇబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై బాధి తులు ఆందోళన చెందుతున్నారు.

➡️