లోకేష్‌ పాదయాత్రలో సజ్జా వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-చీరాల: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు హాజరయ్యా రు. మంగళవారం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న యువకులం పాద యాత్రలో ఆయన నారా లోకేష్‌ను మర్యాదపూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్‌ పాదయాత్రలో ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీని చీరాల నియోజకవర్గంలో బలోపేతం చేసి పార్టీ జెండా ఎగరవేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.

➡️