వంద శాతం పోలియో చుక్కలను పూర్తి చేయాలి

ప్రజాశక్తి-నందలూరు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వంద పోలియో చుక్కలను వేయాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాది óకారి డాక్టర్‌ శరత్‌కమల్‌ పేర్కొన్నారు. పిహెచ్‌షిలో పల్స్‌ పోలియో కేంద్రాల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శరత్‌ కమల్‌ మాట్లాడుతూ పల్స్‌ పోలియో కేంద్రాలు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, దేవాలయాల్లో నిర్వహించాలని పేర్కొ న్నారు. పోలియో చుక్కలు వేయు విధానం, టాలీ సీడ్స్‌ పూరించు విధానం, పిల్లల ఎడమ చేతి చిటికెన వేలుకు గుర్తు, క్యూ లైన్‌ పాటించడం గురించి వివరించారు. మార్చి 3న ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం పోలియో కేంద్రాలలో నిర్వహిస్తామన్నారు. నాలుగు, ఐదవ తేదీలలో కేంద్రా లకు రాని పిల్లల కొరకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కార్తీక్‌ విశ్వనాధ్‌, ఎంపిడిఒ శేఖర్‌ నాయక్‌, ఎంఇఒ అనంతకష్ణ, సూపర్వైజర్‌ సునీతమ్మ, పి హెచ్‌ ఎన్‌.శైలజ, సిహెచ్‌ఒ వెంకటనారాయణ, ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌ హెచ్‌పిలు, ఆశాలు, టీచర్స్‌, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ సునీల్‌, లక్ష్మయ్య, హెల్త్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పుల్లంపేట : మండల కేంద్రంలోని పిహె చ్‌సిలో స్థానిక వైద్యాధికారులు డాక్టర్‌ మనోజ్‌ చంద్ర, డాక్టర్‌ సానేశేఖర్‌ ఆధ్వ ర్యంలో మార్చి 3న నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమంపై వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిహెచ్‌సి పరిధిలో 50 పల్స్‌ పోలియో బూత్‌లు, ఐదు బూట్లు, ఒక మొబైల్‌ పాయింట్‌, ఒక ట్రాన్సిట్‌ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లలను పల్స్‌ పోలియో కేంద్రం వద్దకు తీసుకువచ్చి కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూప ర్వైజర్లు నిర్మల, జయలక్ష్మి, హరోహరమ్మ, వి.కుమారి, పి.మహేష్‌, సుబ్బా రెడ్డి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాక్సినేటర్లు, ఎఎన్‌ఎంలు, ఎం ఎల ్‌హెచ్‌పిఒలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️