వర్షంతో రైతుల్లో ఆనందం..-

Nov 28,2023 22:18
పంట పొలం ఉన్న దృశ్యం

పంట పొలం ఉన్న దృశ్యం
వర్షంతో రైతుల్లో ఆనందం..-
కళకళలాడుతున్న పొలాలు.
.ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :వర్షాలు సమద్ధిగా కురవాల్సిన తరుణంలో అందుకు భిన్నంగా వేసవి తలదన్నేలా ఎండలు విరగ్గాశాయి. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా మూడు రోజుల నుంచి వర్షా లు దంచి కొడుతున్నాయి. దాంతో ఉక్కిరిబిక్కిరైన అన్న దాతలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతో ఉపశమనం కలిగించాయి. వర్షభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అందక బోర్ల కింద వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో హర్షాతి రేకాలను వ్యక్తం చేశాయి. కురుస్తున్న వర్షంతో పైర్లు జీవం పోసుకున్నాయి. రబీ సీజను పురస్కరించుకొని మండలంలో 20-25 ఎకరాల్లో రైతులు వరి సాగు చేప డుతున్నారు. కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాలలోని చెరువులకు జలకళ వచ్చింది. అంతే కాకుండా ఈ వర్షాలకు పొలాల్లోని బోర్లలో కూడా నీరు పెరి గే అవకాశం ఉంది. దీంతో రై తులు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. ప్రకతి కూడా సహకరి స్తుండడం అన్నదాతల ఆనం దానికి అవధులు లేకుండా పో యింది. రైతులు వ్యవసాయ పనుల్లో మునిగితేలుతున్నా రు. ఏదేమైనా నిన్నమొన్నటి వ రకు నెలకొన్న వర్షాభావ పరిస్థి తుల్లో దిగాలు పడ్డ రైతులు విరివిగా వర్షాలు కురుస్తుండడం తో సంబరపడుతున్నారు.

➡️